నాగలాపురం మండలం సురుటుపల్లిలోని సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిట లాడింది. కార్తీకసోమవారం కావడంతో తమిళనాడు భక్తుల తాకిడికూడా భాగా పెరిగింది.
ఆలయంలో ఉదయం రుద్రహోమం, మరియు రుద్రాభిషేకం వేడుకగా నిర్వహించారు.
దేవస్థానం యాగశాలలో రుద్రహోమం,పూర్ణాహుతి కార్యక్రమానికి నందీశ్వరుడిని అలంకరించి మంగళవాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు.
అనంతరం శివనామస్మరణతో మహాధీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు.
అంతకుమనుపు ప్రదోష మండపంలో స్వామి అమ్మవార్ల కు అభిషేకం, దూపదీప నైవేద్యాలు నివేదించారు.
ఆలయ చైర్మన్ ఏవియం మునిశేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్ఛకులు, కార్తీకేయన్ ,పాలకమండలి సభ్యులు,తదితరులు పాల్గోన్నారు.
.