చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో భారీ వర్షాలు కారణంగా పురనరావాస కేంద్రాలకు తరలించిన 114 మంది వరదభాదితులకు యంపిపి ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పీటిసీ విజయలక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి,సర్పంచ్ మంజుల బెల్ట్ రమేష్ లు మండల అధికారులతో తక్షణ సాయం వెయ్యి రూపాయలు అందించారు.
ఎమ్మెల్యే ఆదిమూలం సూచనల మేరకు ప్రతి ఒక్క భాదితునికి ప్రభుత్వ సాయం అందించేలా కృషి చేయడం జరిగిందని అన్నారు.
విపత్కర పరిస్థితులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావులేకుండా సేవలు అందించిన మండల అధికారులను అభినందించారు.
ఈకార్యక్రమంలో తాహాశీల్ధార్ శ్రీదేవి, యంపిడివో సురేంద్ర నాథ్ నాయకులు ఎంపీటీసీ మోహన్ రెడ్డి సర్పంచ్ శ్రీ రాములు పాల్గోన్నారు.
.

Discussion about this post