సత్యవేడు ఏపిఎస్ఆర్టీసి డీపో నుండి తమిళనాడుకు బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని కోరుతూ కోమటిగుంట వాసులు డిఎం గంగాధరంకు వినతిపత్రం అందజేశారు.
గతంలో ఈ డిపో నుండి తమిళనాడుకు నాలుగు బస్సు సర్వీలు నడిపేవారు, పరిశ్రమల్లో పనులు చేసుకునే వారు, విధ్యార్థులు ఈ బస్సులపై ఆధారపడి రవాణా జరిపేవారు.
కానీ ప్రస్తుతం తమిళనాడుకు బస్సు సర్వీసులను పూర్తి స్థాయిలో నడపకపోవడం వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నామని వినతిపత్రంలో పేర్కోన్నారు.
గ్రామస్తుల వినతిపై సానుకూలంగా స్ఫందించిన ఆర్టీసి డిఎం సోమవారం నుండి తమిళనాడుకు బస్సు సర్వీసులను నడిపేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చారు.
ఈకార్యక్రమంలో కోమటిగుంట వాసులు కిషోర్, అన్భు, రాబిన్, ఆల్భర్ట్ లు పాల్గోన్నారు. తమ వినతికి స్పందించినందుకు ఆర్టీసీ డీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
.

Discussion about this post