సత్యవేడు పట్టణంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం కనీసం నడవడం అనేది కూడా దుర్భరంగా మారుతోంది.
ప్రధానంగా ఊతుకోట వెళ్లే రోడ్డు మార్గంలో తెలుగు గంగ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిండిన రోడ్లు బావుల్లాగా దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్డులో ప్రయాణించే వాహనాలు పడిపోవడమో మరమ్మతులకు గురికావడమో జరుగుతోంది.
దీనికితోడు పేరడం, వి.ఆర్.కండ్రిగ, సత్యవేడు నుంచి కవర్ పేట రోడ్డు మార్గంలో కూడా పూర్తిగా ధ్వంసమై పోయిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ఉన్నత అధికారులు , నాయకులు స్పందించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని తెలియజేస్తూన్నారు
.

Discussion about this post