జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్, ఎంపీపీతో కలిసి వరద కారణంగా నిర్వాసితులకు అయిన వారికి బియ్యం పంపిణీ చేశారు.
వరద బాధితులను జగనన్న ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుం టుందని జడ్పీటీసీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ భరోసా కల్పించారు. శనివారం ఉదయం ఎంపీపీ దివాకర్ రెడ్డి తో కలిసి నారాయణవనం మండలం బొప్పరాజు పాలెం ఎస్ టీ కాలనీ లోని 30 వరద బాధిత కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం పంపణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హాయంలో ఏటా వర్షాలు సంవృద్దిగా కురిసి ప్రజలు సంతషంగా ఉన్నారన్నారు. రాజు మాంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్న సామెత నిజంలా ఉందని వారు గుర్తు చేశారు.
వాగులు, వంకలు ఇంకా ఉదృతంగా ప్రవహి స్తున్నందున ఎవ్వరూ వాటి దగ్గరకు వెళ్లవద్దని వారు సూచించారు. మండలంలో ఎవ్వరికైనా సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ సభ్యులు ధర్మ, సర్పంచ్ లు రమేష్, ధర్మ, నాయకులు ఢిల్లీ, వెంకటేష్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post