భర్త తల నరికేసింది…
ఆ భార్య, భర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు. ఇల్లాలికి ఎంత ఆవేశం వచ్చిందో…? అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపింది.
ఆ తరువాత తలను మొండెం నుంచి వేరు చేసి… నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో గురురవారం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే… రేణిగుంట పట్టణంలోని పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర.. తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది.
అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి వెళ్లారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Discussion about this post