తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తమ నాయకులు కరోనా బారినుండి త్వరగా కోలుకుని, తిరిగి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పలుప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపధ్యంలో కరోనా బారిన పడిన తెలుగుదేశం పార్టీ నేతలు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ పార్టీ నేతలు శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం గ్రామదేవతకు అభిషేకం నిర్వహించి.. కొబ్బరి కాయలు కొట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి,నారా లోకేష్, మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, నేతలు ప్రకాష్ నాయుడు, ప్రసాద్ నాయుడు, విజయ నాయుడు కరోనా బారిన పడ్డారన్నారు.
తమ నాయకులంతా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్ల, అందుకే గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంఠా రమేష్, నాగరాజు, ఎమ్మెస్ రెడ్డి, కేవీ ప్రతాప్ రెడ్డి, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, ఆర్ముగం, మురళీ రెడ్డి, దొరబాబు, మోహన్ గౌడ్, భాస్కర్ గౌడ్, కన్నావరం హరిబాబు, శివారెడ్డి, వెంకటరమణ, గాలి అంకయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, గంగిరెడ్డి, సుందరం, కాలప్ప రెడ్డి, ఆటో చిన్న, కృష్ణమనాయుడు, విజయ రాఘవులు, భూపాల్, భాస్కర్ నాయుడు, ఆనంద్, గోపి యాదవ్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post