దళిత డప్పు కళాకారుల సంఘం విస్తరణ చేయడానికి కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి రామానాయుడు పిలుపు నిచ్చారు.
తిరుపతి బైరాగిపట్టెడ లోని గంధమనేని శివయ్య భవన్ లో ఏపీ వ్యసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి, ఏపీ ప్రజానాట్యమండలి, దళిత డప్పుకళాకారుల సంఘం ఆఫీస్ బేరర్స్ సమావేశం టి.క్రిష్ణప్ప అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామానాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడితుల పక్షాన నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ, అనుబంధ సంఘాలు పేదలు ,వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులు గా ఉన్న దళితుల కోసం మరింత కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంస్కృతికంగా సమాజానికి సేవ చేస్తున్న దళిత డప్పు కళాకారులను గుర్తించి దళిత డప్పు కళాకారుల సంఘం లో సభ్యులుగా చేర్చడానికి కృషి చేయాలని కోరారు.
దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కె.కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక రాజ్యం ,సమ సమాజం వైపు కృషి చేస్తున్న నేపథ్యంలో అత్యంత కింది స్థాయిలో వివక్షతను ఎదుర్కొంటున్న దళితులు… వారి అభ్యున్నతి కోసం కృషి చేయడానికి దళిత డప్పు కళాకారుల సంఘం ఒక వేదికగా ఉపయోగపడుతుందనన్నారు.
దళిత డప్పు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ జిల్లాలో 2017 లో శుభ, అశుభ కార్యక్రమాలలో నిరంతరం సేవలందిస్తున్న దళిత డప్పు కళాకారులను గుర్తించి సంఘంగా ఏర్పాటు చేసి ఆనాటి ప్రభుత్వం పై అనేక పోరాటాలు చేసి పెన్షన్ మూడువేల రూపాయలు సాధించిన ఘనత మన సంఘానికి దక్కుతుందన్నారు. అంతేకాకుండా కళాకారులకు గుర్తింపు ఇవ్వడానికి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి చే గుర్తింపు కార్డులు సాధించిన ఘనత కూడా మన సంఘానిదేనని తెలిపారు.
జిల్లాలో ఉన్న 30 వేల మంది కళాకారులను ఐక్యం చేయడానికి కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శులు చిన్నం పెంచలయ్య ,నాగరాజు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులుగా అత్యధిక శాతం ఉన్న దళితులను వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న దళిత డప్పు కళాకారుల సంఘం లో సభ్యులుగా చేర్పించడానికి కృషి చేస్తామని, అలాగే దళిత హక్కుల పోరాట సమితి వివక్షత రూపుమాపడానికి కృషి చేస్తున్న పనిలో భాగంగా సాంప్రదాయ కళలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రజానాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు సుబ్రమణ్యం, గుర్రప్ప మాట్లాడుతూ డప్పు కళాకారులు అందరికీ సాంస్కృతికంగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని… వారిని మరింత నైపుణ్యమైన కళాకారులుగా తయారుచేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు డి వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సురేంద్ర నాథ్, తులసి రాజన్, శివ కుమార్, డి. హెచ్. పి .ఎస్ గౌరవ అధ్యక్షులు జోరేపల్లి రామచంద్రయ్య, డి. హెచ్. పి .ఏస్ జిల్లా అధ్యక్షుడు చిన్నం కాలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పిఎల్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post