శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 10 రోజైన శనివారం రాత్రి గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు అశ్వ వాహనం పైన.. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు సింహ వాహనం పైనా అధిష్టించి పురవిహారం చేశారు.
కైలాసగిరి ప్రదక్షిణకు వెళ్లి సకల దేవతా గణాలకు వీడ్కోలు పలికిన ఆదిదంపతులు రాత్రి 8గంటల తరువాత ఆలయానికి చేరుకున్నారు.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత అశ్వ, సింహ వాహనాలపై పురవిహారం చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
పురవీధుల్లో ఊరేగుతున్న ఆదిదంపతులను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
.

Discussion about this post