టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూలై మూడవ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానుంది.
కాగా, ఈ ఏడాది జనవరి 2న ప్రారంభమైన గరుడ పురాణ పారాయణం జూలై రెండో తేదీన ముగియనుంది.
నాదనీరాజన వేదికపై సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య శ్రీమద్ భాగవతం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్పా విశ్వనాథ శర్మ ప్రవచనం చేస్తారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు కెవి.శేషాచార్యులు, పివిఎస్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేయనున్నారు.
.

Discussion about this post