తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు.
.