తంబళ్లపల్లె మండలంలో ఖాళీగా ఉన్న వలంటీరు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో వై.దివాకర్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మండలంలోని గోపిదిన్నె పంచాయతీలోని బోరెడ్డివారికోట ( ఎస్టీ), కోసువారిపల్లె పంచాయతీలో సీకే దయ్యాలవారిపల్లె, మేకలవారిపల్లె (జనరల్), కోసువారిపల్లె (బీసీ-మహిళ), జుంజురపెట పంచాయతీలో బురుజుపల్లె (బీసీ- జనరల్), ఎర్రసానిపల్లె పంచాయతీ ఎగువముట్రవారిపల్లెలో (బీసీ-జనరల్), మర్రిమాకులపల్లె పంచాయతీ కుడుములవారిపల్లె, తూగువారిపల్లె (బీసీ జనరల్) ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అర్హులై, ఆసక్తి గల వారు ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అన్నారు.
ఎంపికైన వారికి 29న ఇంటి మేషన్ లెటరు అందజేస్తామని తెలిపారు. వారు 30వ తేదీ నుంచి విధుల్లోకి చేరవలసి ఉంటుందన్నారు.
.