దేశంలోని అత్యంత సాహసోపేతమైన, చొరవగల వ్యాపార వర్గాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలయంగా ఉన్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ప్రస్తుతం ఏఐ రంగాలలో ఈ వర్గాలు విస్తరించి ఉన్నాయి. అదే సమయంలో, ఐపిఓ దరఖాస్తులపై గత ఐదేళ్లుగా జరిగిన ఒక కొత్త విశ్లేషణ, తెలుగు వ్యాపార వర్గాల తదుపరి పెద్ద వృద్ధి ప్రయాణం స్టాక్ మార్కెట్ లోనే ఉండబోతోందని సూచిస్తోంది.
దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, 785 పట్టణాల పరిధిలో నమోదైన 1.83 కోట్ల మంది విలక్షణ ఐపిఓ దరఖాస్తుదారులలో తెలంగాణ నుండి 3.99 లక్షల (2.17%) మంది, ఆంధ్రప్రదేశ్ నుండి 4.41 లక్షల (2.40%) మంది ఉన్నారు – అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటికే మొత్తం 8.4 లక్షల మంది మదుపరులు దేశ ప్రైమరీ మార్కెట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది మరింత వృద్ధి సాధించడానికి ఒక బలమైన పునాది. ప్రత్యేకించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల చారిత్రాత్మక మార్కెట్ వాటా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలు ఇంకా ఎంతగా ఎదగడానికి అవకాశం ఉందో ఇది స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి దాదాపు 10,490 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 8,316 మంది దరఖాస్తు దారులు ఉండగా, జాతీయ సగటు 12,841 గా నమోదైంది; ఈ తలసరి గణాంకాలు కూడా ఈ రాష్ట్రాలు మార్కెట్లో మదుపు చేయడంలో ఉన్న అవకాశాన్ని మరో కోణంలో స్పష్టం చేస్తున్నాయి. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నంత మాత్రాన విశ్లేషకులు దీనిని వీరికి ఆకాంక్షలు తక్కువగా ఉన్నాయని భావించడం లేదు. బదులుగా, తెలుగు కుటుంబాలు ఇతరులకన్నా ఏమాత్రం తగ్గకుండా పొదుపు చేస్తారని, వారు క్రమశిక్షణ గల బలమైన మదుపరులని చెప్పడానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు. అలాగే, సంప్రదాయ కంగా భూమి, బంగారంపై ఉన్న మక్కువతో పాటు, తాము పొదుపు చేసే మొత్తంలో మరికొంత భాగాన్ని లిస్టెడ్ ఈక్విటీల (షేర్ మార్కెట్) వైపు మళ్లించడానికి వారికి ఇంకా ఎంతో అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా ఉన్న ధోరణులు మార్కెట్లో పెట్టుబడుల వృద్ధి ఎక్కడి నుండి రావచ్చో సూచిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడుల భాగస్వామ్యంలో హైదరాబాద్ ఒక్కటే ఇప్పటికే దాదాపు 60% వాటాను కలిగి ఉంది. ఇక్కడి ఐటీ, ఫార్మా రంగాల ఉద్యోగుల వల్ల జాతీయ స్థాయిలో ఈ నగరం 13వ స్థానంలో నిలిచింది. ఈ బలమైన పునాదిని వరంగల్, నిజామాబాద్, ఇతర అభివృద్ధి చెందుతున్న పట్టణాలకు విస్తరించడానికి వీలుంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ భాగస్వామ్యం ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరు పతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి వంటి నగరాల్లో సమానంగా విస్తరించి ఉంది. ఇది ఒకే నగరానికే పరి మితం కాకుండా, పలు కేంద్రాలలో మదుపరుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక విస్తృత పునాదిని అందిస్తోంది.
ఆశాజనకమైన విషయం ఏమిటంటే, ఈ వృద్ధికి కావలసిన మౌలిక వసతులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. జూలై 4 నాటి ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుండి 1.24 కోట్ల మంది, తెలంగాణ నుండి 61 లక్షల మంది నమోదిత ట్రేడింగ్ ఖాతాలను కలిగి ఉన్నారు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 13 కోట్ల మార్కును దాటిన మొత్తం మదుపరుల సంఖ్యలో వీరు కూడా భాగమే. ట్రేడింగ్ ఖాతాల లభ్యత ఇప్పుడు ఎంతమాత్రం ఓ అడ్డంకి లేదు. దాంతో, తదుపరి అడుగు – అంటే ఎక్కువ మంది పొదుపుదారులను క్రియాశీల ఈక్విటీ మదుపరులుగా మార్చడం – సులభంగా సాధ్యమయ్యేదేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్లో వైవిధ్యభరితమైన పెట్టుబడులే దీనికి సరైన మార్గం. బంగారం, ఆస్తులు స్థిరత్వాన్ని ఇస్తాయి, బ్యాంక్ డిపాజిట్లు నమ్మకాన్ని (ముందుగా ఊహించగల రాబడిని) అందిస్తాయి; కానీ ఈక్విటీలు దీర్ఘకాలంలో వ్యాపార వృద్ధిలో కుటుంబాలకు ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పిస్తాయి – ఇది సంప్రదాయ ఆస్తులకు ప్రత్యామ్నాయం కాదు, వాటికి అదనపు బలాన్ని చేకూర్చే ఒక విలువైన తోడు మాత్రమే. సెబీ మదుపరుల విద్యా విషయక సమాచారం కూడా సరిగ్గా ఇలాంటి సమతుల్య విధానాన్నే ప్రోత్సహిస్తోంది.
ఈ సమయం కూడా ఈ అవకాశానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓతో ముడిపడి ఉన్న లీడ్ మేనేజర్లు నిర్వహించిన 122 ఐపీఓలలో దాదాపు 70% వరకు ఇష్యూ ధర కంటే పైనే లిస్ట్ అయ్యాయి. మార్కెట్లోకి ప్రవేశించే మదుపరులకు పరిశోధన ఆధారిత, ప్రాథమిక విలువల (ఫండమెం టల్స్) ప్రాధాన్యత విధానం బాగా పనిచేస్తుందని ఇది స్పష్టం చేస్తోంది. మొదటిసారి పెట్టుబడి పెట్టే వారికి వైవిధ్యభరిత మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ మరింత సురక్షితమైన, సుస్థిర మార్గాన్ని అందిస్తా యి.
ఎన్‌ఎస్‌ఈ, జియో వంటి ప్రతిష్టాత్మక ఐపీఓలు రాబోతున్న తరుణంలో, తెలుగు కుటుంబాలు తమకున్న బలమైన పొదుపు సంస్కృతిని సరికొత్త మార్గాల్లో ఉపయోగించుకోవడానికి ఇది సరైన సమయమని విశ్లేష కులు భావిస్తున్నారు. అత్యవసర నిధి, తగినంత ఇన్సూరెన్స్‌తో పెట్టుబడులను ప్రారంభించి, ఆపై డిపాజిట్లు, బాండ్లు, బంగారం, ఈక్విటీలలో వైవిధ్యభరితమైన, లక్ష్య ఆధారిత పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం ద్వారా తమ భారీ పొదుపు మొత్తాన్ని భవిష్యత్తు కోసం మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
.