సాధారణంగా ప్రభుత్వోద్యోగులు, టీచర్లు ఎన్నికల విధులు పాల్గొంటారు కాబట్టి.. వారి ఓటు హక్కును వినియోగించుకోడానికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తారు. అయితే ఈసారి జీహెచ్ఎంసీ కి జరగనున్న ఎన్నికల్లో తొలిసారిగా.. వృద్ధులకు, కొవిడ్ పేషంట్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నారు.
జి.హెచ్. ఎం.సి ఎన్నికల సందర్భంగా వికలాంగులకు, 80 ఏండ్లు పైబడిన వారికి, కోవిడ్ 19 పోసిటివ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పై కెటగిరీల వారు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వినియోగించుకోవచ్చునన్నారు. పోలింగ్ కేంద్రంలో వికలాంగులు మరియు వయస్సు పైబడిన వారి సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేసి, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వికలాంగులు, వయస్సు పైబడిన వారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేయవచ్చు. కోవిడ్ 19 పేషెంట్లు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘం అదికారులు తెలియజేశారు.
.

Discussion about this post