తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును టీటీడీ మూసి వేసింది. వర్షాల నేపథ్యంలో కొండచరియలు కూడా విరిగి పడి ప్రమాదకరంగా మారడంతో.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మరమ్మతుల అనంతరం తిరిగి ఎప్పుడు రెండో ఘాట్ రోడ్డును తెరిచేది తర్వాత ప్రకటిస్తారు.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మొదటి ఘాట్ రోడ్డును, రెండో ఘాట్ రోడ్డుతో అనుసంధానించే లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు పనిచేస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన చోట ఆ సమయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అటుగా వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సును కొద్దిలో ప్రమాదం తప్పించుకుంది.
రెండో ఘాట్ రోడ్డును పూర్తిగా మూసి వేయడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది.
సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్
.

Discussion about this post