దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు స్వాగతం పలికారు.
ఆదివారం తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వాగతం పలికారు.
అమిత్ షా శనివారం రాత్రి తిరుపతి తాజ్ హోటల్ లో బస చేస్తారు. ఆదివారం ఉదయం నెల్లూరు లో కార్యక్రమాల్లో పాల్గొని తిరిగివస్తారు. సోమవారం తిరిగి వెళతారు.
.

Discussion about this post