ఐటి విభాగం తయారు చేసిన ఈ ఎం బుక్ ను నవంబరు 29 నుంచి అమలు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటి విభాగం అధికారులు ఈ ఎం బుక్ ఉపయోగించే విధానంపై డెమో ఇచ్చారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, ఈ ఎం బుక్ సాఫ్ట్వేర్ తయారీ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు త్వరగా పూర్తి చేసి 29వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పారు.
ఈ లోపు ఇంజినీరింగ్ అధికారులు తిరుమల, తిరుపతి ని రెండు డివిజన్లు గా విభజించుకుని ట్రైల్ రన్ నిర్వహించాలని డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ లోపు ఏవైనా సాంకేతిక సమస్యలు గుర్తిస్తే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ ఎం బుక్ అమలు చేయడానికి ఎఈలు, డిఈ ఈ లకు ట్యాబ్, కీ బోర్డ్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మలివిడతలో ఈ ఈ లు, డి ఈ లకు కూడా వీటిని అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎం బుక్ డిజిటలైజ్ చేయడం వల్ల ఒకే సారి ఎంత మందైనా సబంధిత పని వివరాలు చూసే అవకాశం ఉంటుందని ఈవో చెప్పారు. అధికారులు మ్యానువల్ గా బుక్ లు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, సమాచారం కూడా ఆన్లైన్ లో భద్ర పరచే అవకాశం లభిస్తుందన్నారు.
జెఈవో వీర బ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ ఈ లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, అదనపు ఎఫ్ ఏ సిఏవో రవి ప్రసాదు, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
.
Discussion about this post