గుప్తనిధులకోసం తవ్వకాలు తవ్వుతున్న వాళ్లను గ్రామస్థులు అడ్డుకుని, సదరు ప్రబుధ్ధులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరపురం జిల్లా తనుకల్లు మండలం చిన్నచెరువుపల్లి గ్రామ సమీపంలో ఊటకొండలో ఉన్న ఆంజనేయస్వామి పాదాలను గుప్తనిధుల కోసం గాలిస్తున్న వేటగాళ్లు పెకిలించి పగులకొట్టారు.
అర్ధరాత్రి గుట్టలోంచి శబ్దాలు రావడంతో అప్రమత్తమైన గ్రామస్థులు నాలుగు బృందాలుగా ఏర్పడి గుట్టచుట్టూ మోహరించి తవ్వుతున్న ముగ్గురిని నిర్బంధించారు. అయితే గ్రామస్థుల రాకను గుర్తించి మరో నిందితుడు పరారైయ్యాడు. నిందితులను బంధించిన అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చి, తాము అదుపులోకి తీసుకున్న ముగ్గురు గుప్తనిధుల వేటగాళ్లతోపాటు వారి ద్విచక్రవాహనాన్ని పోలీసులకు అప్పగించారు.
అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ గుప్తనిధుల వేటగాళ్లు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
.