జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ ఆవరణంలోని లలిత కళా ప్రాంగణములో తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా టీ షర్టు ల పంపిణీ కార్యక్రమము జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 9 వరకు తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, టీమ్ మేనేజర్లు, కోచ్ లకు ఈ సందర్భంగా టి షర్టు లు, ఐ.డి.కార్డు లు అందజేశామన్నారు. నగరపాలక సంస్థ మేయర్ డా. ఆర్ . శిరీషా మాట్లాడుతూ ఈ పోటీల లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు.
అర్జున్ అవార్డ్ గ్రహీత హోన్నప్ప గౌడ్ ప్రసంగింస్తూ పోటీలో పాల్గొనే క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. కమిషనర్ పి.యస్. గిరీషా మాట్లాడుతూ క్రీడాకారులు కోవిడ్ నిబoధనలు పాటిస్తూ ఇందుకు అవసరమైన శానిటైజర్లు, మాస్క్ లు అందించామన్నారు.
ఈ కార్యక్రమములో డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్ రెడ్డి, అదనపు కమిషనర్ డి. హరిత, ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీకాంత్, స్పోర్ట్స్ ఆర్గనైజర్ పెన్నా భాస్కర్, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా తిరుపతి నగరపాలకసంస్థ పరిధిలోని కార్పోరేటర్లకు, పాత్రికేయులకు టీ షర్టు లను ఇందిరా మైదానములో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ తిరుపతి శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డా. శిరీషా, కమీషనర్ పి.యస్. గిరిషా అందజేశారు.
.

Discussion about this post