అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’! కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రకరకాల మార్గాల్లో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో మార్చి 9న జరిగే ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రావడానికి ఒప్పుకోవడంపై చిత్ర నిర్మాతలు చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ అతిథిగా వస్తున్న విషయాన్ని నిర్మాత బన్నీవాసు స్వయంగా ప్రకటించారు.
అభిమానుల్ని ప్రొత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే స్టైలిష్ట్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయినా సరే ‘చావుకబురు చల్లగా’ టీమ్ కోసం సమయం కేటాయించారు. మార్చి 9న హైదరాబాద్ జేఆర్ సి ఫంక్షన్ హల్లో భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే చిత్రానికి చాలా బజ్ క్రియేట్ అయింది. అయితే ప్రీరిలీజ్ వేదిక మీద బన్నీ కనిపిస్తే చిత్రానికి మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారు. బన్నీ వేదిక మీదికి వస్తే ఫ్యాన్స్ లో కూడా జోష్ వస్తుంది.. బన్నీ ఫ్యాన్స్ మొత్తం ఈ చిత్రాన్ని కూడా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుందనేది వారి ఆలోచనగా ఉంది.
.

Discussion about this post