ఓ వివాహిత.. భర్తకు తెలియకుండా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల కిందట భర్తను విడిచిపెట్టి, అతనితో కలిసి వెళ్లిపోయింది కూడా. ఆ తర్వాత.. పెద్దలు రాజీ కుదిర్చడంతో తిరిగి భర్త వద్దకు వచ్చి సంసారం చేసుకుంటోంది. ఈలోగా ఏం జరిగిందో తెలియదు గానీ.. భర్తతో కలిసి ప్రియుడినే హత్య చేసింది. ఈ సంఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కడపజిల్లా రాయచోటి రాజులకాలనీ కి చెందిన షేక్ యూసుఫ్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అక్రమసంబంధమే హత్య కు ప్రధాన కారణం అని పోలీసులు గుర్తించారు. ఇదెలా జరిగిందంటే..
రాయచోటి టౌన్ లోని కొలిమిమిట్టకు చెందిన షాహీనా అనే వివాహిత తో యూసఫ్‌కు అక్రమ సంబంధం ఉండేది. యూసుఫ్, షాహీనా ఇద్దరూ కలిసి నెల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెద్ద మనుషులు వీరి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. కౌన్సిలింగ్ ద్వారా యూసుఫ్ ను మందలించారు. షాహీనాను తిరిగి ఆమె భర్త వద్దకు పంపారు. అంతవరకు బాగానే ఉంది.
తాజాగా షాహీనా యూసుఫ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. యూసఫ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంటికి పిలిపించి షాహీనా ఆమె భర్త మౌలాలి కలిసి యూసుఫ్ ను కత్తి తో నరికి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
.