• About Us
  • Contact Us
  • Our Team
Saturday, July 25, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వందేళ్ల నాటి ప్రేమలేఖ.. చదివిన వాళ్లు ఫిదా!

aparajitha by aparajitha
November 29, 2021
0
వందేళ్ల నాటి ప్రేమలేఖ.. చదివిన వాళ్లు ఫిదా!

ప్రేమ అనేది మనిషి పుట్టకముందు నుండి ఉంది అంటే నమ్మగలమా.. కానీ నమ్మాలి. ఎందుకంటే ప్రేమ అనేది కేవలం మనుషుల్లోనే కాదు… జంతువుల్లో కూడా ఉంటుంది అనే విషయాన్ని మనకు ఎన్నో సంఘటనలు స్పష్టం చేశాయి. అయితే ఈ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా… లేదా కాలానుగుణంగా మారుతుందా.. అంటే.. ప్రేమ అనేది ఎన్నేళ్లైనా దానిని వ్యక్తం చేయడంలో కాస్త తేడా ఉంటుందేమోకానీ.. ప్రేమలో మాత్రం తేడా ఉండదని చెప్పాలి.

వందేళ్ల క్రితం ప్రేమ ఎలా ఉండి ఉండేది.. అనే విషయం తెలుసుకోవాలంటే.. ఆకాలానికి సంబంధించిన ఎవరైనా ప్రేమికుడు, లేదా ప్రేయసి తమ ప్రేమ గురించి చెప్పగలగాలి.. ఈ ప్రయత్నం మనకు టైటానిక్ విషయంలో తెలిసిన సంగతే. అయితే ప్రేమను వ్యక్తం చేయడానికి చదువుకున్న వారికి ఉన్న ఒకే ఒక మార్గం లేఖ రాయడం. ఇలాంటి ఒక పురాతన ప్రేమలేఖ మనకు లభ్యమయింది. ఈ లేఖ ఆనాటి ప్రేమ గురించి మనకు తెలియజెపుతుంది.

మనకు ముఖ్యంగా కాలేజీ చదివేవారికి ప్రేమ లేఖలు రాయడం అనేది ఒకప్పుడు చాలా సహజంగా ఉండేది. అయితే ప్రేయసీ ప్రియుల మధ్య నడిచే ఈ ప్రేమ లేఖల్లో వారు ఎలాంటి సంగతులను అందులో వ్యక్తం చేశారు అని తెలుసుకోవాలని మిగిలిన వారికి చాలా ఆసక్తిగా ఉంటుంది. దీంతో కొందరు దొంగతనంగా అవతలి వారి ప్రేమలేఖలను తీసి చదవడం కూడా కద్దు.

అంటే ప్రేయసీ, ప్రియులు తమ ప్రేమను ఎలా వ్యక్తం చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవాలని చాలామంది ఉబలాటపడుతుంటారు. మరి వందేళ్లనాటి ప్రేమలేఖ దొరికితే..ఆనాటి ప్రేమను వారు ఎలా వ్యక్తం చేసుకుని ఉంటారో అని అందరికీ ఆసక్తి ఉంటుంది కదా.. మరి వందేళ్లనాటి ప్రేమ లేఖ ఎలా బయటపడింది అని కూడా మనకు ఆసక్తి ఉంటుంది. బ్రిటన్ లోని ఒక డాన్ కార్న్స అనే మహిళ, ఆమె కొడుడు లూకాస్ కలిసి ఒక ప్రేమలేఖను గుర్తించారు.

అదికూడా ఎలా అంటే.. వాళ్ల ఇంట్లోని ఒక పెద్ద టీవీ పాపం కిందపడి పగిలిపోయింది. ఈ పగిలిపోయే పనిలో భాగంగా వాళ్లింట్లోని నేలమీది టైల్స్ కూడా పగిలిపోయాయి. అలా పగిలిపోయిన ఒక టైల్ లో సదరు ప్రేమ లేఖ దొరికింది. దీంతో అది చాలా పురాతనమైన ప్రేమలేఖగా లూకాస్ గుర్తించి తన తల్లికి తెలిపాడు. 

ప్రేమలేఖ అనగానే ఏం రాసివుంటారో అనే ఆసక్తితో దాన్ని చదవడానికి తల్లీకొడుకులు ప్రయత్నించారు. కానీ అది అసలే పురాతనమైనది.. దానికితోడు పగిలిన టైల్ లో దొరికింది. ఇక చదవడానికి ఎలా వీలవుతుంది.. పాపం వారి వల్ల కాలేదు.  ఏంచేయాలో పాలుపోక తల్లీకొడుకులు ఇద్దరూ కలిసి సదరు ప్రేమలేఖను సుదీర్ఘంగా పరిశీలించి అది ఒక పెళ్లైన ఇల్లాలికి ఆమె పాత ప్రేమికుడు రోనాల్డ్ హబ్ గుడ్ అనే వ్యక్తి రాసినట్టు గుర్తించారు. 

Also Read : మోసం జరిగింది.. ప్రేమ ముసుగులోనా? ఇంకొక రకంగానా?

అంతా బాగానేవుంది.. కానీ అందులో ఏం రాశాడు.. అనేది ఇద్దరూ తెలుసుకోలేకపోయారు. దీంతో ఏంచేద్దామా అని ఆలోచించి చివరికి ఆ పురాతన ప్రేమలేఖను తమ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో అందులోని ఇతర స్నేహితులంతా కలిసి ఆ ప్రేమలేఖను చదివేందుకు ప్రయత్నించారు. ఇలా అందరి సహాయ సహకారాలతో మొత్తానికి వందేళ్లకిందని ప్రేమలేఖను చదివారు. ఇంతకీ అందులో ప్రియుడు తన ప్రేయసికి ఏమని రాశాడంటే..

‘‘ప్రియతమా.. నువ్వు నన్ను రోజూ చూడడంకోసం వస్తున్నావా..? మనమధ్య ప్రేమ అనేది మనిద్దరి మధ్యే ఉండాలి. ఎందుకంటే నీవు పెళ్లైన ఇల్లాలివి. ఇలా నువ్వు నాకోసం రావడం అనేది వేరే సమస్యలను సృష్టిస్తుంది ప్రియా. నిన్ను కలవమని నువ్వు నన్ను రోజూ అడవద్దు. మనం కలుసుకోవాలనుకుంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్ధరాత్రి కలుద్దాం ప్రియా. త్వరలో మనం మళ్లీ కలుద్దాం. నీ ప్రియమైన రోనాల్డ్’’

అయితే ఇందులో తన ప్రేయసిని రోనాల్డ్ వచాలా అద్భుతంగా వర్ణించాడటని లూకాస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రేమలేఖపై రాసిన తేదీ వగైరాలేవీ లేవు. కానీ దాన్ని నెట్టింట్లో పెట్టడంతో సదరు నెట్టింటివారు ఆ లేఖ రాతను, దాని పురాతనమైన రూపును పసిగట్టి అది కనీసం 1920 కంటే ముందు రాసి ఉంటారని అంచనావేశారట. అయితే లూకాస్ వాళ్లు ఉంటున్న ఇల్లుమాత్రం 1917లో కట్టారట. అంటే 1917కన్నా ముందే రోనాల్డ్ తన ప్రియురాలితో ప్రేమకలాపాలు సాగించి, ప్రేమలేఖలు రాసివుంటాడు.

Also Read : పవన్ కల్యాణ్ సంస్కారం ఏమిటో మీకు తెలుసా?   

అందులో ఒకలేఖ ఇలా మన కళ్లముందుకు వచ్చింది. ఈ ప్రేమలేఖ ఎవరు ఎవరికి రాశారు అనేదానిపై పాపం ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఆరాలు తీశారట… కానీ ఇదేమీ శివమణి సినిమా కాదుకదా.. సీసాలో లేఖతో వెతికి ప్రేయసీ ప్రియుల్ని కలిపేయడానికి.. జీవితం.. ఎవరు ఈ రోనాల్డ్, ఏమిటి వారి ప్రేమకథ అనే విషయం పాపం ఎవరూ తెలుసుకోలేకపోయారట. మొత్తానికి ప్రేమ అనేది వందేళ్లకు ముందైనా.. వెయ్యేళ్లకు ముందైనా ఒకే తీరుగా ఉంటుంది. ప్రియుడికి ప్రేయసి అందమైన సుందరిగానే కనిపిస్తుంది. ప్రేయసికి కూడా ప్రియుడు నవ మన్మధుడిగానే కనిపిస్తాడు అనేది జగమెరిగిన సత్యం అని మనం నమ్మాల్సిందే. 

Tags: 100 years love letter1917Britain letterlovelucasold love letterRonald
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply