తిరుపతి జిల్లాలో 9మంది తహసీల్దార్లకు జాయింట్ కలెక్టరు బాలాజీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నూతన జిల్లాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకేసారి 9మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి బాలాజీ తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు.
ఏపీ సేవ, స్పందన పోర్టల్ లో నిర్ణీత సమయం మేరకు మ్యుటేషన్ లు పరిష్కారం చూపనందుకు జేసీ ఈ నోటీసులు ఇచ్చారు. తిరుపతి జిల్లా పరిధిలోని తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, పాకాల, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, దొరవారి సత్రం, తిరుపతి రూరల్, చిల్లకూరు, మండలాల తహసిల్దార్లు షోకాజ్ నోటిసులు అందుకున్న వారిలో ఉన్నారు.
.