అమెరికా వెళ్లడం కోసమే పుట్టినట్టు, అమెరికా వెళ్లలేకపోతే ఇక చచ్చిపోయినా పర్లేదన్నట్టు.. అదేదో జీవితానికి పరమార్థం అయినట్లుగా కలగనే వారు బోలెడు మంది ఉంటారు. అమెరికా వెళ్లడానికి వీసా రావడం అంటే.. అదేదో అత్యంత కఠినమైన వ్యవహారంగా సమాజంలో ముద్ర పడిపోయింది కూడా. ఇతరదేశాల వారికి వీసా అనుమతించడంలో అత్యంత కఠినమైన అమెరికా నిబంధనలు, వారికి నచ్చకపోతే ఎలాంటి కారణాలు చెప్పకుండానే వీసాలు తిరస్కరించడం వంటి అనేక వ్యవహారాలు వీసా కోరుకునే వారిలో దాని విలువను మరింత పెంచేస్తాయి.
అలాంటి పరిస్థితుల్లో.. అమెరికా వీసా కోసం ఎగబడడం, వెంపర్లాడడం కూడా సహజం కదా! ఎక్కడైతే వెంపర్లాట, ఎగబడడం ఉంటుందో.. అక్కడ మోసం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. కానీ.. అమెరికా వీసాల విషయంలో కూడా అదే జరిగింది. అమెరికా నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో, పైరవీలకు ఆస్కారం ఉండదో.. అవన్నీ తెలిసినా కూడా కొందరు ఇలాంటి పైరవీకార్ల బుట్టలో పడ్డారు.
Read this : విమర్శకులకు పవన్ కల్యాణ్ షాక్
అమెరికా స్టూడెంట్ వీసాలు మేం ఇప్పిస్తాం అని వల విసరగానే.. బోలెడు అమాయక చేపలు పడ్డాయి. ఆ రకంగా హెచ్ 1 బి వీసాల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు భారీగా వసూళ్లు చేశారు. ఘరానా మోసానికి బలైనట్టు వాళ్లు గుర్తించిన తర్వాత.. పోలీసులు రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సునీల్ , ప్రణీత మరో ముగ్గురుపై ఏపీ సిఐడి కేసు నమోదు చేశారు. మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి పోలీసులు కేసు నమోదు చేసారు. 420 ,34 ,406 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులకు లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే సిఐడి అధికారులు పలువురిని విచారించారు. లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
.

Discussion about this post