ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలను నిషేధించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఖండించారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ విషయాలూ నిజాలు కాకపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల విషయంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఎలాంటి నిషేధమూ విధించలదేని క్లారిటీ ఇచ్చారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో చర్యలకు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్న సవాంగ్, నూతన సంవత్సర వేడుకలలో జాగ్రత్తలు పాటించాలన్నారు. శీతాకాలం కనుక కోవిడ్ జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలన్నారు.
వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతున్నామని, ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలనూ సేకరిస్తున్నామని, ఎవరిమీదైనా అనుమానం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు జాగ్రత్తలకోసం కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సంప్రదిస్తున్నామని సవాంగ్ చెప్పారు.
ఏపీలో తీసుకుంటున్న అనేక ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసు స్టేషన్లలో సిసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాకప్ లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వంతో సంప్రదించి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదంటూనే, కోర్టుల నుంచీ వచ్చిన ఏ కామెంట్ కూ తిరిగి రెస్పాండ్ కాలేమని సవాంగ్ అన్నారు.
.