• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

రియల్ లైఫ్‌లో ‘గోట్ లైఫ్’ సినిమా కథ ఇది!

admin by admin
June 23, 2026
0
రియల్ లైఫ్‌లో ‘గోట్ లైఫ్’ సినిమా కథ ఇది!

ఓటీటీ వేదికలు పరభాషా చిత్రాలను కూడా మనకు అత్యంత అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత.. బాగా పాపులర్ అయిన సినిమాల్లో మళయాళ చిత్రం ‘గోట్ లైఫ్ (ఆడుజీవితం) కూడా ఒకటి! తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచితుడైన పృధ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరో. మనుగడ కోసం సాగే పోరాటం ఈ సినిమా. 2008లో వచ్చిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకుడు.

దండిగా డబ్బులు సంపాదించవచ్చుననే ఆశతో నజీబ్ ముహమ్మద్ (పృథ్వీరాజ్) సౌదీ అరేబియాకు వెళ్తాడు. ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత తమకోసం ఎవరూ రాకపోగా.. ఎటు వెళ్లాలో దిక్కుతెలియని స్థితిలో ఒక స్థానిక అరబ్బు సాయం చేస్తానంటే అతని వెంట వెళ్తారు. అతడు వీరిని తీసుకెళ్లి ఒక నిర్జనమైన ఎడారి ప్రాంతంలో మేకల్ని మేపే కూలిపనిలో వారిని పెట్టేస్తాడు. అత్యంత దుర్భరస్థితిలో బతుకుతూ.. వెట్టిచాకిరీ చేస్తూ అక్కడినుంచి తప్పించుకునే దారికూడా లేక, సరైన తిండి కూడా లేక.. నజీబ్ జీవితం దుర్భరంగా మారిపోతుంది. పారిపోవడానికి ప్రయత్నంచి.. అలాంటి మరికొందరిని కూడా కలుపుకుని ఎడారికి అడ్డం పడి పారిపోతూ వచ్చి.. చివరికి అష్టకష్టాలు పడి మొత్తానికి స్వస్థలానికి తిరిగివస్తాడు. పొట్టకూటి కోసం వలసలు వెళ్లే పేదలు పరాయిదేశాల్లో మోసానికి గురైతే.. ఎంతటి దుర్భరమైన జీవితాల్లో బతుకుతుంటారో తెలియజెప్పే సినిమా ఇది. చూసినవాళ్ల గుండెను తడిచేస్తుంది.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, ఆదర్శిని

ఇదే తరహా మోసాలు.. వలసజీవుల్ని దాదాపుగా కిడ్నాపు చేసి, తప్పించుకోజాలని దుర్భర పరిస్థితుల్లో ఇరికించేసి వారితో వెట్టిచాకిరీ చేయించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నదని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. పోలీసు కేసులు నమోదైన తర్వాత అలాంటి ఉదాహరణలు మన దృష్టికి వస్తాయి. అసలు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా.. మరెంతమంది ఇలాంటి వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న వలసకూలీలు ఉంటున్నారో కదా.. అనే ఆలోచన కూడా మనకు కలుగుతుంది.

వివరాల్లోకి వెళ్దాం..

బీహార్, ఒదిశా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు తదితర ప్రాంతాల నుంచి కూటికి గతిలేని కూలీలు వలసవచ్చి మన ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో బతుకుతుండడం మనం ప్రతిచోటాచూస్తుంటాం. అలాంటి ఒక కూలీతో పాటు, తెలుగువాడే అయిన మరో కూలీ కూడా ఇలాంటి వలలో చిక్కుకున్న దృష్టాంతం ఇది. చీరాల మండలానికి చెందిన మైనాపల్లి రాజు, బీహార్ కు చెందిన అశోక్ గిరి విజయవాడలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ బతుకుతున్న కూలీలు. ఏప్రిల్ లో రైల్వేస్టేషన్ వద్ద పనుల కోసం వేచిఉన్నప్పుడు.. బొందిరాజు, చింతల వెంకన్న అనే ఇద్దరు పరిచయం అయ్యారు. గుంటూరులో మంచి జీతంతో పనులున్నాయని చెబితే, వీరు ఆశపడి వారి వెంట వెళ్లారు.

ఈ ఇధ్దరికీ బాగా మద్యం తాగించి, వేర్వేరు వాహనాలు మారుస్తూ చివరకు నాగార్జున సాగర్ దిగువన కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఒకచోట వారిని నిర్బంధించారు. వారితో చేపలు పట్టించడం వాటిని ఎండబెట్టించడం చేసేవారు. కూలీ డబ్బులిచ్చే వారు కాదు సరికదా, సరైన తిండి కూడా లేకుండా వెట్టిచాకిరీతో జీవితం దుర్భరంగా మారిపోయింది. రోజుకు 18 గంటలుపైగా పనిచేయించేవారు. అనేకరకాలుగా వేధిస్తుండేవారు. వారిద్దరూ ఎలాగోలా తప్పించుకుని అష్టకష్టాలు పడి చివరికి విజయవాడ చేరుకున్నారు. కొన్ని రోజుల కిందట ఇద్దరూ మళ్లీ పనుల కోసం రైల్వేస్టేషన్ వద్ద నిల్చుని ఉన్నప్పుడు.. కిడ్నాపు చేసి తీసుకెళ్లిన బొందిరాజు, చింతల వెంకన్న మళ్లీ కనిపించారు. ఇతర కూలీల సాయంతో వెంటబడి బొంది రాజును మాత్రం పట్టుకుని పోలీసులకు అప్పగించి.. కేసు పెట్టారు.
ఇదీ జరిగింది!

కడుపుకూటి కోసం వలసలు వెళ్లిన కూలీలను రకరకాలుగా మోసం చేసి వారితో ఆటాడుకునే, వారివద్ద ఉన్నదంతా దోచుకుని రోడ్డున పడేసే వంచకుల గురించిన సీన్లు అనేకం మన తెలుగు సినిమాల్లో కూడా చాలా ఉన్నాయి. కానీ.. మళయాళంలో వచ్చిన ఆడుజీవితం (గోట్ లైఫ్) పూర్తిగా వంచనకు గురైన ఒక వలసకూలీ.. ఎలా బయటపడ్డాడో.. తెలియజెప్పే హృదయవిదారకమైన కథ!

ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా? అనేది మనకు ఆశ్చర్యం కలిగించే అంశం. వీరిద్దరు ఆ ఉచ్చులోంచి బయటపడ్డారు కాబట్టి.. కిడ్నాపు చేసిన వారు మళ్లీ కనిపించారు కాబట్టి.. వ్యవహారం పోలీసు కేసు దాకా వెళ్లింది. అంతవరకు వెళ్లని దుర్భర జీవితాలు మరెన్ని ఉన్నాయో మనకు తెలియదు. వలస కూలీలు.. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు.. రకరకాల కారణాల వల్ల.. ఇక్కడ పాల్పడుతున్న నేరాలు మాత్రమే మనకు తరచుగా వార్తలు కనిపిస్తుంటాయి. కానీ.. వారు కూడా ఇలా వంచనకు, నిర్బంధానికి, దోపిడీకి గురవుతున్న ఉదంతాలు కూడా అనేకం మన చుట్టూనే జరుగుతున్నట్టుగా ఈ ఘటనల వల్ల తెలుస్తోంది.

అతి తక్కువ కూలీలకు ఇతర రాష్ట్రాల కూలీలు దొరుకుతుంటారు. కొద్దిగా ఎక్కువ డబ్బు దొరికే ఆశచూపితే వారు ఇలాంటి ఉచ్చుల్లో సులువుగానే చిక్కుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి దుర్మార్గమైన దోపిడీలను అరికట్టడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. సరైన చర్యలుంటే.. వలసకూలీలకు జరిగే అన్యాయాలను అరికట్టడం మాత్రమే కాదు, వారి ద్వారా జరిగే నేరాలను కూడా కట్టడి చేయడం సాధ్యమవుతుంది.

Tags: goatlife moviepridhviraj sukumarnఆదర్శిని సంపాదకీయంఏపీలో సినిమా కథలుకెఎ మునిసురేష్ పిళ్లెవలసకూలీల దోపిడీ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply