జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30లక్షల70వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాభిషేకం అంటూ జగన్మోహన్ రెడ్డి తనకు తానే కనాకాభిషేకం చేసుకుంటున్నాడు అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోని టాయిలెట్ విస్తీర్ణమంతకూడా లేని సెంటుస్థలంలో పేదవాడి కుటుంబం ఎలా జీవిస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇళ్లపట్టాల పేరుతో వైసీపీ జలగలు రూ.6500కోట్లవరకు అవినీతికిపాల్పడ్డారని ఆయన నిశిత విమర్శలు చేశారు.
ఎకరం రూ. 5, రూ.10లక్షల విలువచేసే భూమిని రూ. 60 లక్షలు, రూ.70 లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టి, భారీ అవినీతికి పాల్పడ్డారని పట్టాభిరాం ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి సాగించిన ఇళ్లపట్టాల దోపిడీపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆధారాలతో సహా ఫొటో ఎగ్జిబిషన్ రేపుఉదయం ఏర్పాటుచేస్తున్నామని ఆయన చెప్పారు.
తాము ఆధారాలను ప్రజలముందుంచుతామని, వాటిని చూసిన తర్వాత కూడా వైసీపీనేతలు ఎవరైనా సరే తాము అవినీతికి పాల్పడలేదని చెప్పగలరా? అని పట్టాభిరాం సవాలు విసిరారు.
.