బహుజన పెద్దలంతా కలిసి బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రిని చేయాలని నగరి నియోజకవర్గ బీఎస్పీ నాయకులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లోని నగరి గ్రామీణ మండలం లో బహుజన పెద్ద లతో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడారు.
తమ పార్టీ విధివిధానాలను గురించి వారితో చర్చలు జరిపి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరూ కలిసి ఏనుగు గుర్తు పైన ఓటు వేసి మాయావతి ని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయాలని పిలుపుఇచ్చారు. తద్వారా భారతదేశంలో ఉన్న 136 కోట్ల ప్రజలు అందరూ అభివృద్ధి సాధించవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన పెద్దలు ఏ యేసు రాముడు, గోవింద స్వామి, రాజేంద్రన్, వజ్రం మరియు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు జీకే నగిరి మండలం కోశాధికారి ఆర్ కార్తీక్, నియోజకవర్గ ఇన్చార్జి వై నాగూర్ పాల్గొన్నారు.
.