సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఈ నెల 2, 3 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కడప జిల్లా పర్యటన అనంతరం మద్యాహ్నం 3.30 గంటలకు సీఎం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 03.55 నుండి 4.30 గంటలవరకు రేణిగుంట మండలం, వెదల్లచెరువు ఎస్.టి. (యానాది) కాలనీ, 4.40 నుండి 4.55 ఏర్పేడు మండలం, పాపానాయుడు పేట పర్యటిస్తారు
సాయంత్రం 5.10 నుండి 5.25 గంటల వరకు తిరుపతి రూరల్ తిరుచానూరు పాడిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. తిరుపతి శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకుని, జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం రాత్రి బస చేస్తారు.
3వతేదీ ఉదయం తిరుపతి నగరంలోని కృష్ణా నగర్, ఆటోనగర్ ప్రాంతాల నివాసితులతో మాట్లాడుతారు,
10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నెల్లూరు జిల్లా పర్యటన అనంతరం మ.3.20 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకొని గన్నవరం తిరుగుప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆప్రకటనలో తెలియజేసారు. .
.
Discussion about this post