తంబళ్లపల్లె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 9గంటల నుంచి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
15ఏళ్లు పూర్తయిన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని ఆయన పేర్కొన్నారు.
పోటీల్లో పాల్గొన దలచిన విద్యార్థులు తప్పని సరిగా తమ ఆధార్ కార్డు తీసుకురావాలని ఆంజనేయులు కోరారు.
వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో ఆసక్తి గల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
.