సినీనటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ పాలిటెక్నిక్ కళాశాలలోని ఒక విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కడప జిల్లాకు చెందిన వాసంతి, పాలిటెక్నిక్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని గ్రామంలో ఒక ప్రెవేటు హాస్టల్ లో ఉంటున్న వాసంతి.. మేడమీదనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కడప జిల్లాకు చెందిన వాసంతి, ప్రైవేట్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సినీనటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.
పరీక్షలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవడం, తన తండ్రి కళాశాల వద్దకు రావడంతో వాసంతి భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్దనున్న ఓ ప్రయివేటు వసతి గృహంపై నుంచి ఆమె కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో కదలలేక పడున్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై తమకు ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.
.

Discussion about this post