ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఓ మహిళ (39) ఈ నెల 12వ తేదీన చెన్నైకి వచ్చింది. అక్కడ నుచి తిరుపతికి చేరుకుంది.
విదేశం నుంచి వచ్చిన మహిళ కావడంతో ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సదరు మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయింది.
ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో ఈమె రక్త నమూనాలను జీనోమ్ సీక్వన్స్ కు పంపారు. ఈమె కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు వైద్య వర్గాలు ధృవీకరించాయి.
తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో నగర వాసులు, పరిసర ప్రాంతాల వారు ఆందోళనకు గురవుతున్నారు.
కాగా రాష్ట్రంలో ఇది రెండవ ఒమిక్రాన్ కేసు కావడం గమనార్హం. ఇటీవలనే రాష్టంలోనే మొట్ట మొదట సారిగా విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
గతంలో చిత్తూరు జిల్లాలోని తొలి కరోనా కేసు కూడా శ్రీకాళహస్తిలోనే నమోదు అయింది. లండన్ నుంచి వచ్చిన యువకుడు జిల్లాలో మొదటి కరోనా కేసుగా తేలారు. ఇప్పుడు జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు తిరుపతిలో నమోదు కావడం విశేషం. కాగా, ఆమె రాష్ట్రంలోనే రెండో ఒమిక్రాన్ కేసు.

.

Discussion about this post