• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లేటు వయసులో పెళ్లా?.. బహుపరాక్! 😁

admin by admin
December 21, 2021
0
లేటు వయసులో పెళ్లా?.. బహుపరాక్! 😁

పెళ్లి చేసుకునేప్పుడు మిత్ర బంధువులందరినీ పిలిచి, వారందరి సమక్షంలో పెళ్లిచేసుకోవాలంటారు పెద్దలు. ఇదేమీ వారి ఆశీస్సులకోసమో, వారిచ్చే కానుకల కోసమో అనుకుంటాం మనం! నిజానికి జరిగేది కూడా అదే. కానీ, అందరికీ చెప్పి, అందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టి వారిని సంతుష్టులను చేసి పెళ్లి చేసుకోవడంలో ఒక ఎడ్వాంటేజీ ఉంది.

ఆ ఎడ్వాంటేజీ.. వారి సాక్ష్యం. అవును నిజమే. మిత్ర బంధువుల సాక్ష్యం, పోలీసు కంప్లయింటు ఇవ్వాలంటే వారి సపోర్టు కొన్నిసార్లు చాలా అవసరం అవుతుంది. ఈ సంఘటన గురించి చదివితే మాత్రం.. పెళ్లికి వచ్చే వాళ్ల ఆశీస్సులూ కానుకలూ అక్కర్లేదు.. కానీ సాక్ష్యం మాత్రం తప్పక కావాలి అని క్లారిటీ వస్తుంది.

వివరాల్లోకి వెళితే-

ఎవరో ఒకరు.. అమ్మాయి దొరికితే చాలు పెళ్లి చేసేసుకుందాం.. అని లేటు వయసులో పెళ్లికి సిద్ధపడిన ఓ వ్యక్తికి చాలా భిన్నమైన అనుభవం ఎదురైంది. హైదరాబాదులో ఓ ముదిరిపోయిన నలభయ్యేళ్ల బ్రహ్మచారికి ఇప్పటికైనా సరే పెళ్లి చేసుకోవాలని కోరిక బలంగా పుట్టింది. చూడబోతే ఎవ్వరూ పిల్లనిచ్చేలా కనిపించడం లేదు. చూడబోయిన అమ్మాయిలు మొహం తిప్పేసుకుంటున్నారు. ఎవరో ఒకరు- అమ్మాయి దొరికితే చాలని ఓ బ్రోకరును పట్టుకున్నాడు.

ఏ క్లాస్ అమ్మాయి ఉంది.. లక్ష ఇచ్చావంటే పెళ్లికి ఒప్పిస్తా  అని ఊరించాడు బ్రోకరు. ఆ లక్షా ఆశగా ముట్టజెప్పాడు. ఇద్దరూ కలిసి బెజవాడ వెళ్లారు. అమ్మాయిని చూశాడు. అంతే.. అర్జంటుగా పెల్లి చేసేసుకోవాలని కోరిక పుట్టింది. తన తాలూకు ఎవరికైనా చెప్పాలి.. అందరినీ పిలవాలి.. అనేంత వరకు కూడా ఆగలేకపోయాడో ఏమో.. అక్కడికక్కడే ఒక బెజవాడ లాడ్జీలో పెళ్లి చేసేసుకున్నాడు.

కొత్త దంపతులిద్దరూ కలిసి యాదగిరి గుట్ట వచ్చి వ్రతం చేసుకుని, రాత్రికి ఇంటికి చేరుకున్నారు. వెంట ఆ పెళ్లికూతురు స్నేహితురాలు కూడా వచ్చింది. జీవితంలో తనకు తొలిసారి తొలిరాత్రి జరగబోతున్నదని అతగాడు ఊహల్లో విహరిస్తున్నాడు. తమ తొలిరాత్రికి అడ్డు ఎందుకని.. భార్య స్నేహితురాలిని సాగనంపడానికి ఓ క్యాబ్ కూడా బుక్ చేశాడు. ఆ మధురోహల్లో విహరిస్తుండగా.. నవవధువుకు తలనొప్పి వచ్చింది. ‘ప్రియా.. కాస్త మందుల షాపుకు వెళ్లి తలనొప్పికి మందు తేవా’ అని వేడుకొంది. అతగాడు కరిగిపోయి.. షాపుకువెళ్లాడు. తిరిగివచ్చి చూసేసరికి.. భార్య లేదు! కంగారు పడ్డాడు.

అరె.. అనుకుని విస్తుపోయే లోగా.. అంతకంటె పెద్దగా నిర్ఘాంత పోయాడు. పెళ్లి కాగానే కొత్త పెళ్లాం కోసం కొన్న మూడు తులాల బంగారు గొలుసు, నలభై వేలు దుస్తులు అన్నీ అమ్మాయి సహా మాయం అయినట్టు గుర్తించాడు. ఇంట్లో ఉండాల్సిన నగలు, డబ్బు కూడా కనిపించలేదు. భార్య, ఆమె స్నేహితురాలు ఇద్దరూ ఆ క్యాబ్ లోనే ఉడాయించారని అతడికి ఆ తర్వాత అర్థమైంది. పారిపోయిన ఇద్దరూ కారులోనే బట్టలు మార్చేసుకుని ఎల్బీనగర్ దిగేసి వెళ్లారని, క్యాబ్ డ్రైవరు ద్వారా తెలుసుకుని గొల్లుమన్నాడు. ఆ తర్వాత తీరిగ్గా తమ బంధువుల్లో పెద్దలకు చెప్పుకుని గొల్లు మన్నాడు. పెళ్లి సంగతి చెప్పలేదు గానీ.. ఆ రూపంలో బోల్తా పడ్డ సంగతి విని వారంతా నవ్వుకునే ఉంటారు.!

మొత్తానికి పెళ్లికోసం చాలా ఆత్రంగా ఉన్న ముదురుబ్రహ్మచారిని ఎలా బురిడీ కొట్టించాలో అలా బురిడీ కొట్టించి.. ఆ అమ్మాయి ఉడాయించింది. మనవాడి పెళ్లి కలలు అంతలోనే కల్లలయ్యాయి.

ఈ స్టోరీలో దొంగ పెళ్లి కూతురు దొరుకుతుందా లేదా తర్వాతి సంగతి. ఎటూ బ్రోకరు ఇతడికి తెలిసిన వ్యక్తే  గనుక, అతడి ఫోను నెంబరు ఉంటుంది గనుక.. పోలీసులు మిస్టరీ ఛేదించి.. ముదురు బ్రహ్మచారికి దొరికిన- వీరముదురు (తెలివితేటల్లో) అమ్మాయిని పట్టుకోవచ్చు గాక.. కానీ..

మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే..

– పెళ్లి గురించి ఎంత ఆత్రం ఉన్నప్పటికీ.. ముందూ వెనుకా చూసుకోకుండా.. ఎవ్వరికీ చెప్పుకోకుండా పెళ్లి చేసేసుకోకూడదు!

పెళ్లి లాంటి తంతును నలుగురికీ చెప్పి చేసుకోవాలని పెద్దలు సూత్రీకరించడం వెనుక ఇలాంటి మతలబు కూడా ఉంటుందని మనం ఎన్నడైనా ఊహించామా?

అతివలు.. పెళ్లి ముసుగులో మోసాలు చేయడం చాలా రకాలు చూశాం. మరీ ఇంత బరితెగించి.. మోసం చేయడం చిత్రమే.

#HBD_ysjagan: జగన్‌ నుంచి నేర్చుకోవాల్సిన 9 లక్షణాలివే!

సమీక్ష : మన గర్వం పెంచే ‘జగమునేలిన తెలుగు’

Tags: cheater womancheating in the name of marriagewoman cheated in the name of marriageనవవధువు మోసాలునిత్య పెళ్లికూతురుమోసాల పెళ్లికూతురు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply