డెమోక్రటిక్ సోసియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజ పక్సే కుటుంబ సభ్యులతో
గురువారం ఉదయం 10 గంటలకు కొలంబో విమానాశ్రయం నుండి బయలు దేరి 11.10 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుమల శ్రీకృష్ణ అతిధి గృహం చేరుకొని బస చేస్తారు. 24 వ తేది ఉదయం
7.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని శ్రీలంక తిరుగు ప్రయాణం కానున్నారు.
కేంద్రసహాయమంత్రి వర్మ
ఉత్తర, తూర్పు ప్రాంతాల సహాయ సహకారాలు, అభివృద్ధి కేంద్ర సహాయమంత్రి బి.ఎల్.వర్మ గురువారం తిరుమల చేరుకొని మద్యాహ్నం 1.00 గంటకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రి 7.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ వెళ్లనున్నారు.
జస్టిస్ దండే సుబ్రహ్మణ్యం
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సభ్యులు జస్టిస్ దండే సుబ్రహ్మణ్యం కర్నూలు నుండి బయలుదేరి తిరుమల చేరుకొని బసచేస్తారు. 24 న ఉదయం తిరుమల శ్రీవారిని, 9.00 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారిని , 10.30 గంటలకు శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్నూలు తిరుగు ప్రయాణం అవుతారు.
రాజస్థాన్ మంత్రి
రాజస్థాన్ మంత్రి రాం లాల్ జెత్ గురువారం తిరుమల చేరుకొని బసచేస్తారు. 24 న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం 4.20 రేణిగుంట విమానాశ్రయం నుండి బెంగళూరు వెళ్లనున్నారు.
.
Discussion about this post