చిత్తూరు జిల్లా సత్యవేడు మండల విద్యా వనరుల కేంద్రం చేపట్టిన వీధిబాలల సర్వేలో ముగ్గురు డ్రాపౌట్స్ విద్యార్థులను అధికారుల బృందం గుర్తించారు .
శుక్రవారం స్థానిక ఎంపిడిఓ సురేంద్ర నాథ్ పర్యవేక్షణలో ఎంఈ ఓ రవి ఆధ్వర్యంలో వీధి బాలలు సర్వే కొనసాగింది.
ఇందులో భాగంగానే అధికారుల బృందం సత్యవేడు పట్టణంలోని పలు దుకాణాల వద్ద కు వెళ్లి వీధి బాలలపై ఆరా తీశారు .
ఈ నేపథ్యంలో డ్రాపౌట్స్ అయిన విద్యార్థులు జహీరుద్దీన్,సిద్దిక్,లోకేష్ తదితర వీధి బాలలను గుర్తించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ రవి మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం అన్నారు.బడిలో ఉండాల్సిన బాలలపై చిన్నతనంలోనే పనిభారం మోపడం శిక్షార్హం అవుతుందన్నారు.
పైగా బాలలను పనిలోకి పెట్టుకొని వారితో వెట్టిచాకిరీ చేయించుకోవడం చట్టం అనుమతించదు అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిలు మునిస్వామి,కుమార్ చెంగమ్మ,బాలకృష్ణ,రామారావు తదితరులు పాల్గొన్నారు.
	    	
.
    	
		    
Discussion about this post