భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి సేవలు ఆదర్శనీయమని బీజేపీ తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఇంఛార్జి చంద్రప్ప అన్నారు.
వరదయ్యపాళెంలో జరుగుతున్న ప్రశిక్షణా తరగతుల్లో శనివారం వాజపేయి 97వ జయంతి వేడుకలు నిర్వహించారు. వాజపేయి చిత్ర పటానికి పూలమాలుల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ వాజపేయి తన రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా పేరు గుర్తింపు పొందారన్నారు. నేటి నేతలు అందరూ ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు నధుల అనుసంధానానికి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా చంద్రప్ప గుర్తు చేశారు.
వాజపేయి జయంతిని పురస్కరించుకుని దేశం నేడు సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటుండటం చాలా ఆనందదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, రాష్ట్ర అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
	    	
.
    	
		    
Discussion about this post