శ్రీకాళహస్తి మండలంలోని వీఆర్ఏలు తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ దీక్షలకు సి ఐ టి యు డివిజన్ కార్యదర్శి పెరగడం గురవయ్య మద్దతు తెలిపారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు .
తొమ్మిది రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకుండా వీఆర్ఏ పట్ల వ్యవహరిస్తుంది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ చేయాలని 65 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ కుటుంబాలకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డి ఎతో కూడిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ పుల్లయ్య సిపిఎం శ్రీకాళహస్తి టౌన్ కార్యదర్శి గంధం మణి వెళ్లి వేంద్రం వీఆర్ఏలు పాల్గొన్నారు.
.