తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను స్థాపించబోయే జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి కోసం కొత్త ఇంగ్లిషు దినపత్రికను ప్రారంభించే యోచన చేస్తున్నారు.
తెరాసకు.. నమస్తే తెలంగాణ ద్వారా.. మీడియా పరమైన ఎడ్వాంటేజీ సాధించినట్లే.. బీఆర్ఎస్ కోసం.. ఇంగ్లిషు పత్రిక ఉండాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాలకు మీడియా సపోర్ట్ ఎంత ముఖ్యమో, అవసరమో కేసీఆర్ కీలకంగా గుర్తించారు గనుకనే.. తెలంగాణ ఉద్యమం సమయంలో నమస్తే తెలంగాణ పత్రికను పార్టీకి అనుబంధంగా స్థాపించారు. అలాగే టిన్యూస్ టీవీ ఛానెల్ ను కూడా ప్రారంభించారు. వీటిద్వారా ఉద్యమభావజాల ప్రచారం బాగా జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా.. ప్రభుత్వ అనుకూల ప్రచారానికి ఈ రెండు మీడియా సంస్థలు ఎంతో ఉపకరిస్తున్నాయి.
ఆ అనుభవాలనుంచే.. జాతీయ పార్టీకి కూడా.. ఒక ఇంగ్లిషు దినపత్రికను ప్రారంభించాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఎటూ మరి కొన్ని నెలల్లోగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి పొత్తులు ఎలా ఉంటాయో.. ఏయే రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అస్తిత్వం ఉండగలదో ఒక అవగాహన ఏర్పడుతుంది గనుక.. అప్పటికి ఆ ప్రాంతాల్లో సర్కులేట్ అయ్యేలా పత్రికను ప్రారంభించాలని అనుకుంటున్నారు.
.
Discussion about this post