రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పం లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
పెద్దిరెడ్డి అక్రమ కేసులకు అంబాసిడర్ అని చెప్పారు. కార్యకర్తలు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టిన ఘనత పెద్దిరెడ్డిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే నంబరు:1 ముఖ్యమంత్రి అని డబ్బా కొట్టుకుంటూ… ఇపుడు ఆదాయం లేదని ఏడ్చేది కూడా వారేనని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఉద్యోగులు అడిగిన పీఆర్సీ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందన్నారు.
కుప్పంలో చంద్రబాబు పర్యటనతో పెద్దిరెడ్డికి భయమెందుకన్నారు. చంద్రబాబుకు గొప్ప పనులు చేయడమే తెలుసునని… గొప్పలు చెప్పకోవడం తెలీదని అమరనాథ రెడ్డి అన్నారు.
.
Discussion about this post