తొట్టంబేడు మండలంలోని పెద్ద కనపర్తి అంగన్వాడీ కేంద్రంలో గౌతమ్ అనే చిన్నారికి విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలైనాడు.
విషయం తెలుసుకున్న అంగన్వాడీ సిబ్బంది చిన్నారి తల్లిదండ్రులకు విద్యుత్ షాక్ తగిలిందని చెప్పకనే ఫిట్స్ వచ్చిందంటూ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పారు .
చిన్నారి చేతిపై గాయాలు బొబ్బలు లేవటంచూసి విచారణ చెయ్యగా విద్యుత్ షాక్ తగిలిందని తరువాత చెప్పడం తో చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బంది పై మండిపడ్డారు.
అంగన్వాడీ కేంద్రం ముందు నుండి వెనుకవైపు ఇంటికి విద్యుత్ తీగలు తీసుకుని ఉన్నారు .ఆ విద్యుత్ తీగలు తెగి పడి ఉండటంతో ఆట ఆడుకుంటున్న చిన్నారి గౌతమ్ ఆ వైరును పట్టుకోవడంతో విద్యుత్ షాక్ కు గురయ్యాడు.
గౌతమ్ తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు . ఈ సంఘటనపై సీడీపీఓ ను వివరణ అడగగా సంఘటనా స్థలం వద్ద ఉన్నానని ఇక్కడ అటువంటి ప్రమాదమేమీ జరగలేదని చెప్పడం కొసమెరుపు.
ఈ విషయం మీడియాకు తెలియకుండా గ్రామంలోని పంచాయతీ నిర్వహించి సర్దిపెట్టాలని అంగన్వాడీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం .
.

Discussion about this post