శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులును శ్రీకాళహస్తి నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు.
అంజూరు తారక శ్రీనివాసులు స్వగృహంలో ఈ సన్మానం కార్యక్రమం జరిగింది. శ్రీనివాసులుకు పూలమాల వేసి.. దుశ్శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘ నేతలు మాట్లాడుతూ.. అంజూరు తారక శ్రీనివాసులు ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా నియమించబడటం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వారు కోరుకున్నారు. ముక్కంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు.. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు వై.శ్రీహరి, కోట చంద్రశేఖర్, నాగూర్, వై.నాగరాజు, కృష్ణమూర్తి, రమేష్, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post