పుష్కరుడు అనుననది శివుని అష్టమూర్తులలో ఒకరూపంగా చెబుతారు. బ్రహ్మదేవుడు పరమేశ్వరుని కీర్తిస్తూ అతని అష్టమూర్తులను శ్లాఘించాడు. శివుడిని సర్వభూత స్వరూపుడిగా కీర్తించాడు. అందులో మొదటి రూపం రుద్రుడు : సూర్యడు. సకల చరాచర సృష్టికి మూలం సూర్యుడు. జగత్తులోని అన్నింటి శక్తికీ మూలం సూర్యుడే. అందుకే సూర్యని శివ రూపంగా చెబుతారు. సూర్యుని భార్య సువర్చల, కుమారుడు శని.
రెండవ రూపం భవుడు : లోకాలన్నీ నీటిలో తేలియాడుతున్నవని గ్రహించేవాడే భవుడు. మూడవ రూపం శివుడు : శర్వుడు అనే పేరుతో కూడా ఈ రూపంలో శివుడు పిలువబడతాడని బ్రహ్మ చెబుతాడు. అనగా భూమి రూపం. నాల్గవరూపం పశుపతి : అగ్నిరూపం. ఐదవ రూపం ఈశ్వరుడు : అనగా వాయురూపం. ఆరవ రూపం భీముడు : అనగా ఆకాశ రూపం. ఏడవ రూపం ఉగ్రుడు : అనగా గృహస్తు రూపం. ఎనిమిదవ రూపం మహాదేవుడు : అనగా చంద్రుడు. ఈ మూర్తిలో పరమేశ్వరుడు ఓషధులకు అన్నింటికీ అధిపతియై అన్ని ప్రాణులకు జీవనాభివృద్ధిని కలుగజేయునని శివపురాణంలో బ్రహ్మ తెలిపాడు.
ఇందులో మనకు పరమేశ్వరుని పంచభూతాలకు సంబంధించిన రూపాలు లింగాకారంలో దర్శనమిస్తాయి. కంచిలో పృథివి లింగం.జంబుకేశ్వరంలో జలలింగము, తిరువణ్ణామలైలో జ్యోతి (అగ్ని)లింగము, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగము రూపంలో పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి :
తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా?
పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ
పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా?
ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?