తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించడానికి ప్రజలను అనుమతించడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు చాలా బాధ, ఆవేదన కలుగుతున్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ హిందూత్వానికి ద్రోహం చేసేస్తున్నట్టుగా ఆయన బాధ పడుతున్నారు. ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంతకీ సోము వీర్రాజు ఆవేదన ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర నదిలో భక్తులను పుష్కర స్నానాలు చేయించడానికి అనుమతించడం లేదుట. కొవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో పుష్కర ఘాట్ల వద్ద పిండప్రదానాలు, ఇతర స్నానాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా భయంతో నదిలో గుంపులుగా స్నానాలు చేయడానికి అనుమతించలేదు గానీ.. నదీ జలాలనే గట్టున స్నానం చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇలాంటి జాగ్రత్తతో కూడుకున్న ఏర్పాట్లు సోము వీర్రాజు కు నచ్చినట్టు లేదు. అదంతా తప్పంటున్నారు.
అక్కడెక్కడో కర్ణాటక రాష్ట్రంలో దావణగెరె జిల్లా హరిహర్ లాంటి ప్రాంతాల్లో తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని ఆయన ఉదాహరణ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భక్తులు తుంగభద్ర స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఈ వివరాలతో ఆయన ఒక ట్వీట్ చేశారు.
అయితే సోము వీర్రాజు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం కేవలం కొవిడ్ దృష్ట్యా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టలేకనే.. నదిలో దిగి స్నానాలు చేయడాన్ని నిషేధించి, నదీజలాల స్నానాలకు భారీ వ్యయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఈ స్థితిలో మోడీ ఉన్నా కూడా ఇదే పనిచేసేవారని ఆయన తెలుసుకోవాలి. హరిహర్ లో నదీస్నానాలకు అనుమతిస్తున్నట్టు ఆయన గుర్తిస్తే అది కూడా తప్పే అని కూడా సోము వీర్రాజు గ్రహించాలి. అక్కడ ఏలుబడి సాగిస్తున్నది తమ పార్టీ ప్రభుత్వమే గనుక.. అలాంటి పని వద్దని అక్కడి బీజేపీ సర్కారుకు బుద్ధి చెప్పాలి.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి :
తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా?
పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ
పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా?
ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
నిజానికి తుంగభద్ర నదీ కర్నాటకలో చాలా దూరం ప్రయాణిస్తుంది. హరిహర్ లో మాత్రం ఎందుకు అనుమతిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎందుకు నదీ స్నానాలు అనుమతించడం లేదు. ఆ సంగతి కూడా సోము వీర్రాజు ఆలోచిస్తే బాగుంటుంది. నిజానికి హరిహర్ లో స్నానాలకు వెళ్తున్న భక్తులకు కూడా సోము వీర్రాజు పిలుపు ఇస్తే బాగుంటుంది- అలాంటి ప్రమాదకరమైన పని చేయవద్దని.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ప్రజల కోసమే.. దీన్ని కూడా మతం రంగు పులిమి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు నమ్మరని సోము వీర్రాజు గ్రహించాలి.
కర్ణాటక రాష్ట్రంలో దావణగెరె జిల్లా హరిహర్ లాంటి ప్రాంతాల్లో తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భక్తులు తుంగభద్ర స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? pic.twitter.com/bkqcBqIJTn
— Somu Veerraju (@somuveerraju) November 20, 2020
.

Discussion about this post