తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీకాళహస్తికి చెందిన పఠాన్ అస్మత్ ను నియమించారు.
ఈ మేరకు ఆ పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహ యాదవ్ సోమవారం అస్మత్ కు నియామక ఉత్తర్వులు పంపారు. ఈ సందర్భంగా పఠాన్ అస్మత్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజక వర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులతో తనకు ఈ పదవి లభించిందన్నారు.
తనపై ఎంతో నమ్మకం ఉంచి మైనార్టీ సెల్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారాలోకేష్, అచ్చెన్నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి శాయిశక్తులా పని చేస్తానని చెప్పారు.
2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే తమ ధ్యేయమన్నారు. అదేవిధంగా మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
కాగా అస్మత్ కు పదవి రావడం పట్ల పలువురు ఆయన్ను అభినందించారు.
.