కొవిడ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు సౌజన్య చెప్పారు. శ్రీసిటీ పరిధిలోని మోండలీజ్ కంపెనీ సహకారంతో నడపబడుతున్న సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారరం ఆరూరులో కళాజాత నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సౌజన్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కొవిడ్ తగ్గుముఖం పట్టిందని ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని చెప్పారు.
భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం. శానిజైటరు వినియోగించడం చేయాలన్నారు. అనంతరం కొవిడ్ పోస్టర్స్, బ్యానర్ లు, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఆటో ఆరూర్ గ్రామం సచివాలయం వద్ద కళాజాతా ద్వారా కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్డెప్ప కళాజాతా బృందం వారు అవగాహన కల్పంచారు. కోఆర్డినేటర్ హేమంత్ గారు మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమం ఏప్రిల్ 14 వరకు వరదయ్య పాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతుందని తెలిపారు.
ప్రాజెక్ట్ సూపర్ వైజరు కిరణ్ కుమారి మాట్లాడుతూ కార్యక్రమం లో భాగంగా కొవిడ్ కి సంబంధించిన కరపత్రాలు పంచడం, కళాజాత ద్వారా అవగాహన, టీకా వేసుకోని వారికి టీకా వేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమం లో సేవ్ ది చిల్డ్రన్ సిబ్బంది, ఆరూర్ సచివాలయం సిబ్బంది, ఆశ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
.
Discussion about this post