ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమా తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు డా. చంద్రప్ప ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి బిజెపి నాయకులు పట్టణంలో మిఠాయిలు పంచుకుని, బాణాసంచా పేల్చుకుని ఘనంగా సంబరాలను నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశప్రజలంతా ఎంతో ఆతృతతో ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడం నరేంద్రమోదీ నాయకత్వం పట్ల, ఆయా రాష్ట్రాల నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యోగి గారికి అద్వితీయమైన విజయాన్ని అందించి చరిత్రను తిరగరాశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో లో బిజెపి రాష్ట్ర నాయకులు గరికిపాటి రమేష్ బాబు, సొట్ట సుకుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, ఉమా సింగ్, వాసు, నాగరాజు వెంకటేశ్వర ఆచారి, బిజెపి కార్యకర్తలు, లతా, శాంతి, మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బిజెపి శ్రేణులు అధికార సాధనకు మరింత నిబద్ధతతో కృషి చేస్తారని అన్నారు.
.
Discussion about this post