రైతు సంఘం నేత దర్శన్‌పాల్ సింగ్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై ఎందుకు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో చెప్పాలని ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దర్శన్ పాల్ సహా రైతు సంఘం నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నోటీసుల్లో పేర్కొన్నారు. కిసాన్ ట్రాక్టర్ పరేడ్ హింసలో విచారణ కోసం ఆయన రైతులకు పిలుపు ఇచ్చారు. ఆయనతో పాటు పంజాబీ సింగర్, యాక్టర్ దీప్ సిద్దూ, గ్యాంగ్ స్టర్ లెక్క సదానా పైనా ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఎర్రకోట ముట్టడి కేసులో పోలీసులు ముమ్మరంగా విచారణ జరపుతున్నారు.
రంగంలోకి అమిత్ షా
నేరుగా విచారణను పర్యవేక్షించకపోయినప్పటికీ.. అమిత్ షా రైతుల ఉద్యమంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసలో గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించనున్నారు. మద్యాహ్నం 12 గంటలకు సివిల్ లైన్స్ లోని ట్రామా సెంటర్ ఆసుపత్రికి అమిత్ షా వెళ్లనున్నారు. జనవరి 26న కిసాన్ గణతంత్ర పరేడ్ సందర్భంగా ఆందోళనకారులు చేసిన దాడిలో 394 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన పోలీసులను అమిత్ షా పరామర్శించనున్నారు.
.

Discussion about this post