తెలుగు జాతికి గర్వపతాక అయిన మేధావి, ప్రధానిగా ఈ దేశానికి సేవలందించిన తెలుగు మహనీయుడు, బహుభాషా కోవిదుడు, పండితుడు, ఐటీరంగం సాంకేతిక విప్లవాన్ని భారతదేశానికి తీసుకు వచ్చిన దార్శనికుడు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు.
పీవీ నరసింహారావు పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, కిషన్‌రెడ్డి లు ప్రధానిని కోరారు. వీరి విజ్ఞప్తితో పీవీ పేరుపై కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నది. ప్రస్తుతం పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా పోస్టల్ స్టాంప్‌ను ఇలా ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.
దేశం గర్వించదగ్గ నేత పీవీ పేరుపై పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన నేత పీవీ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పార్లమెంట్‌కు ఎన్నికైన నేత పీవీ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు.
.

Discussion about this post