తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 73 వ జన్మదిన వేడుకలు బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు కామేష్ యాదవ్ అత్యంత వైభవంగా నిర్వహించారు.
తొండమనాడు గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వద్ద రూరల్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కమిటీ మెంబర్లు, తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు, కలసి ముందుగా శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి నారా చంద్రబాబునాయుడు గారు పేరిట సహస్రనామార్చనలు జరిపారు.
ఆయన ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆయన సంకల్పం నెరవేరి మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించారు. అమరావతి రాజధాని నిర్మించి… నదుల అనుసంధానం చేసి.. యువతకు భవితను అందించి.. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి రావాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీకాళహస్తి ఇన్చార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ అధ్యక్ష, ముఖ్య నాయకులకు తిని పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దందోల భక్తవత్సల రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, వంకాయలపాటి బత్తి రెడ్డి,
జగదీశ్వర్ రెడ్డి, దొరై రాజు రెడ్డి, విజయ్ కుమార్, మునస్వామి, యాతలూరు దామోదర్ రెడ్డి, చుక్కల రమేష్, ఎస్. ఈశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రమేష్ నాయుడు, వెంకటరెడ్డి, శివారెడ్డి, గురుస్వామి యాదవ్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
.