ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 49వ జన్మదినాన్ని చంద్రగిరి పట్టణ అధ్యక్షుడు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మొదట టవర్ క్లాక్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కొత్తపాటి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటాల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి యుగుంధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మస్తాన్, ఐతేపపల్లి సింగిల్ విండో మాజీ ఛైర్మన్ అగరాల దేవారెడ్డి, సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు ఉందన్నారు. జనం కోసం పుట్టి, జనంతోనే ఉంటూ, జనంతోనే జీవిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
రాజన్న లేకపోయినా జగనన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బుల్లెట్ చంద్రమౌశి రెడ్డి,కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి,మురగయ్య, బండారు హేమచంద్రా రెడ్డి, నవనీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post